• Home » New Delhi 

New Delhi 

CCTV Footage: రోడ్లపై జాగ్రత్త.. మరీ ముఖ్యంగా పిల్లలను ఎక్కించుకుని వెళ్లేటప్పుడు..!

CCTV Footage: రోడ్లపై జాగ్రత్త.. మరీ ముఖ్యంగా పిల్లలను ఎక్కించుకుని వెళ్లేటప్పుడు..!

సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆ వీడియోలో ఏముందంటే.. ఒక మెయిన్‌ రోడ్‌పై కారు వేగంగా దూసుకొస్తోంది. పక్క వీధిలో నుంచి ఒక వ్యక్తి తన కూతురిని (చిన్నారి) స్కూటీపై ఎక్కించుకుని మెయిన్ రోడ్‌పైకి వస్తుండగా వేగంగా వచ్చిన ఆ కారు తండ్రీకూతురు వస్తున్న స్కూటీని ఢీ కొట్టింది.

Joe Biden: భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎప్పుడంటే..?

Joe Biden: భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎప్పుడంటే..?

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో భారత్ రానున్న బైడెన్ నాలుగు రోజులపాటు ఇక్కడే ఉండున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 10 మధ్య బైడెన్ పర్యటన సాగనుంది.

Manish Sisodia: ఎమ్మెల్యే ఫండ్ విడుదల చేసేందుకు సిసోడియాకు కోర్టు అనుమతి

Manish Sisodia: ఎమ్మెల్యే ఫండ్ విడుదల చేసేందుకు సిసోడియాకు కోర్టు అనుమతి

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్ నుంచి నిధుల విడుదలకు అనుమతి కోరుతూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన విజ్ఞప్తికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై సీబీఐ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

Delhi Minor Rape case: కారులో తప్పించుకునే ప్రయత్నం చేసిన కీచక అధికారి

Delhi Minor Rape case: కారులో తప్పించుకునే ప్రయత్నం చేసిన కీచక అధికారి

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేమోదయ్ ఖాఖా, ఆయన భార్య సీమా రాణి ఢిల్లీ పోలీసుల కళ్లు కప్పి కారులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ దంపతులు పారిపోక ముందే వారిని అరెస్టు చేశారు.

WCD Officer Suspend:  రేపిస్టు అధికారిపై కేజ్రీవాల్ సస్పెన్షన్ వేటు

WCD Officer Suspend: రేపిస్టు అధికారిపై కేజ్రీవాల్ సస్పెన్షన్ వేటు

తన స్నేహితుడి 14 ఏళ్ల కూతురిపై కొద్ది నెలలుగా అత్యాచారం చేస్తూ గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేసే సీనియర్ అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారంనాడు ఆదేశించారు. దీనిపై సాయంత్రం 5 గంటల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని కూడా చీఫ్ సెక్రటరీని అడిగారు.

DDA Sports Complex: ఢిల్లీ వాసులకు మోదీ కానుక: లెఫ్టినెంట్ గవర్నర్

DDA Sports Complex: ఢిల్లీ వాసులకు మోదీ కానుక: లెఫ్టినెంట్ గవర్నర్

దేశరాజధానిలోని ద్వారక ప్రాంతంలో ఢిల్లీ డవలప్‌మెంట్ అథారిటీ స్పోర్ట్స్ అభివృద్ధి పరచిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా శుక్రవారంనాడు ప్రారంభించారు. ఇది ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అందమైన కానుక అని అన్నారు.

Union Cabinet: తెలుగు రాష్ట్రాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Union Cabinet: తెలుగు రాష్ట్రాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) ఆమోదం తెలిపింది.

Nitish Kumar: అటల్‌జీ అభిమానం చూరగొన్నా: నితీష్

Nitish Kumar: అటల్‌జీ అభిమానం చూరగొన్నా: నితీష్

దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు ఘనంగా నివాళులర్పించారు. బీహార్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న నితీష్ అక్కడి నుంచి అటల్ సమాధి స్థల్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయితో తన అనుబంధాన్ని, ఆయన తన పట్ల చూపించిన అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.

Mallikarjun Kharge: ఎర్రకోట వద్ద ఉత్సవాలకు ఎందుకు హాజరుకాలేదంటే..?

Mallikarjun Kharge: ఎర్రకోట వద్ద ఉత్సవాలకు ఎందుకు హాజరుకాలేదంటే..?

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇచ్చారు. మొదటగా తాను కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాయని, రెండవది ప్రోటోకాల్ ప్రకారం తన నివాసం వద్ద ఉదయం 9.20 గంటలకు త్రివర్ణ పతాకం ఎగురవేశానని చెప్పారు.

Vajpayee memorial: వాజ్‌పేయి స్మారకం వద్ద ఐక్యత చాటుకున్న ఎన్డీయే

Vajpayee memorial: వాజ్‌పేయి స్మారకం వద్ద ఐక్యత చాటుకున్న ఎన్డీయే

మాజీ ప్రధాన దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థలమైన 'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఆయనకు ఘన నివాళులర్పించారు. తొలిసారి బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయేకు కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి